ఏపీ రవాణా శాఖ కీలక నిర్ణయం.. హెల్మెట్‌ ధరించకపోతే ఇక అంతే..

ఇటీవల నూతనంగా అమల్లోకి వచ్చిన మోటార్‌ వాహన చట్టాన్ని ఇకనుంచి కచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది.

Update: 2019-12-18 04:49 GMT

ఇటీవల నూతనంగా అమల్లోకి వచ్చిన మోటార్‌ వాహన చట్టాన్ని ఇకనుంచి కచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా విజయవాడ నగరంలో హెల్మెట్‌ ధరించని ద్విచక్ర వాహనదారులపై చర్యలకు ఉపక్రమించింది. జనవరి 1వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్‌ చేపట్టనుంది. విజయవాడలో 5 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఇందులో 60 శాతం మందికి పైగా హెల్మెట్‌ లేకుండానే రోడ్లపైకి వస్తున్నారు.

దీంతో ఏదైనా జరిగితే వారి కుటుంబానికి తీరని లోటు ఉంటుందని భావించిన ఏపీ ప్రభుత్వం ఇకనుంచి హెల్మెట్‌ ధరించని వాహనచోదకుల డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చెయ్యాలని భావిస్తోంది. అయితే అది పర్మినెంట్ గా కాదు. నెల రోజులపాటు మాత్రమే సస్పెండ్‌ చేస్తారు.

సస్పెన్షన్‌ సమయంలో మళ్లీ డ్రైవింగ్‌ చేస్తే వాహనాన్ని సీజ్‌ చేస్తారు. ఈ విషయాన్ని రవాణా శాఖా అధికారులు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లావ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో నిబంధనలు పాటించని 372 మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌లను సస్పెండ్‌ చేశారు. కాగా మేజర్ మరణాలు హెడ్ ఇంజురీ వలెనే అవుతున్నాయని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి వాహనచోదకులు తప్పకుండా హెల్మెంట్ ధరించి వాహనాన్ని నడపాలని కోరుతున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా లేదా లైసెన్స్‌ రద్దు సమయంలో వాహనం నడిపి ప్రమాదానికి గురైతే ఇన్సూరెన్స్‌ సొమ్ము రాదని కృష్ణా జిల్లా డీటీసీ ఎస్‌.వెంకటేశ్వరరావు తెలిపారు.

Tags:    

Similar News