ఆ విషయం వినగానే చాలా బాధ అనిపించింది: ఉప ముఖ్యమంత్రి శ్రీవాణి
మద్యం వలనే మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పుష్పశ్రీవాణి అన్నారు.
మద్యం వలనే మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పుష్పశ్రీవాణి అన్నారు. దిశ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మద్యపాన నిషేధం చేయాలన్నారు. దిశ సంఘటనపై మాట్లాడుతూ.. 'దిశ విషయం వినగానే చాలా బాధ అనిపించింది. తప్పు చేసినవాడికి దేవుడు కచ్చితంగా శిక్ష విధిస్తాడు అనడానికి నిదర్శనం దిశ విషయంలో జరిగిన ఎన్‌కౌంటర్. దేశంలో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టాలు తీసుకు రావాలని అన్నారు.
మహిళలపై దాడులు జరగడానికి ప్రధాన కారణం మద్యపానం. అందుకే వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తున్నారని గుర్తుచేశారు. మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా ప్రతి గ్రామంలో కూడా ఒక మహిళా పోలీస్‌ను పెడుతున్నారు.' అని ఉప ముఖ్యమంత్రి శ్రీవాణి పేర్కొన్నారు.