కోటి తులసార్చనలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి దంపతులు

పార్వతీపురంలో గల శ్రీ కన్యకపరమేశ్వరి ఆలయంలో కళింగ వైశ్య సంఘం ఏర్పాటు చేసిన కోటి తులసార్చన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు.

Update: 2019-12-22 05:59 GMT
ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పా శ్రీవాణి

పార్వతీపురం: పార్వతీపురంలో గల శ్రీ కన్యకపరమేశ్వరి ఆలయంలో కళింగ వైశ్య సంఘం ఏర్పాటు చేసిన కోటి తులసార్చన కార్యక్రమంలో ఆదివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పా శ్రీవాణి తన భర్త పరిక్షీత్ రాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ అర్చన కార్యక్రమంలో సుమారు 750 మంది జంటలు పాల్గొన్నాయి.

ఈ అర్చన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి పుష్పా శ్రీవాణి మాట్లాడుతూ ఇటువంటి ఆద్యాత్మిక కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించిన పార్వతీపురం ఆర్యవైశ్య సంఘం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలని అన్నారు. ఆర్యవైశ్య సంఘ సభ్యులు తమ వద్దకు తీసుకువచ్చిన సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.



Tags:    

Similar News