వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డ తులసిరెడ్డి

వైసీపీ పాలనపై మాజీ రాజ్యసభ సభ్యుడు, ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

Update: 2019-12-10 02:36 GMT
తులసిరెడ్డి

వైసీపీ పాలనపై మాజీ రాజ్యసభ సభ్యుడు, ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సోనియాగాంధీ 73వ జన్మదినం సందర్భంగా కడప నగరంలోని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు తులసిరెడ్డి. అనంతరం కడప కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో ఆయన మాట్లాడారు. విప్లవాత్మక చట్టాలను తీసుకురావడంలో సోనియాగాంధీ చాలా కీలకంగా వ్యవహరించారని కొనియాడారు. మద్యం ధరలు పెంచడంతో రాష్ట్రంలో మోత మొదలైందని అన్నారు. రాయల పాలనలో వజ్రాలు రాసులు పోసి అమ్మితే.. ఇప్పటి ముఖ్యమంత్రి హయాంలో ఇసుకను రాసులు పోసి అమ్మే పరిస్థితికి ఏపీని తీసుకొచ్చారని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని.. వైసీపీ నేతలే ఇసుక అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నిత్యావసర ధరలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారని అన్నారు.మొన్నటివరకు ఫ్రీగా దొరికే ఇసుక కూడా ఇప్పుడు బంగారంలా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు వైఎస్‌ వివేకా హత్య జరిగితే ఆ కేసులో ఇప్పటివరకు పురోగతి కనిపించలేదని అన్నారు. ఎన్నికల ముందు రావాలి జగన్‌ కావాలి జగన్‌ అన్న ప్రజలు ఇప్పుడు ఆయన్ను ఎప్పుడెప్పుడు సీఎం పీఠం నుంచి దిగిపోతారా అని ఎదురుచూస్తున్నారన్నారు. 

Tags:    

Similar News