Andhra Pradesh: ముగిసిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ

Andhra Pradesh: ఎన్నికల్లో చెదురు మదురు ఘటనల మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

Update: 2021-02-21 10:18 GMT

పంచాయతీ ఎన్నికలు 

Andhra Pradesh: ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహించగా.. ఇవాళ చివరి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటికే కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం ఉపసర్పంచ్‌ ఎన్నిక జరగనుంది. కాగా.. ఇప్పటివరకు జరిగిన మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ తన సత్తా చాటింది. మిగిలిన పార్టీలు రెండు, మూడు స్థానాల్లో పోటీ పడ్డాయి.

రాష్ట్రవ్యాప్తంగా చివరిదశ పంచాయతీ ఎన్నికల్లో 78.90 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక.. జిల్లాల వారీగా పోలింగ్‌ శాతాన్ని పరిశీలిస్తే.. మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలో 78.81 శాతం పోలింగ్‌ నమోదైంది. అలాగే.. విజయనగరం జిల్లాలో 85.60%, విశాఖ-84.07%, తూర్పు గోదావరి జిల్లా-74.99%, పశ్చిమ గోదావరి జిల్లా-79.03% పోలింగ్ నమోదైంది. ఇక.. కృష్ణా జిల్లాలో 79.29%, గుంటూరు జిల్లాలో 76.74%, ప్రకాశం జిల్లాలో 78.77%, నెల్లూరులో 73.20%, చిత్తూరు జిల్లాలో 75.68%, కడప జిల్లాలో 80.68%, కర్నూలు జిల్లాలో 76.52%, అనంతపురం జిల్లాలో 82.26% పోలింగ్‌ నమోదైంది.




Tags:    

Similar News