తెలంగాణ పోలీసుల కొత్త ఆంక్షలు..ఏపీ కొవిడ్‌ రోగుల అంబులెన్సుల‌కు నో ఎంట్రీ

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా విజృంభ‌ణ భారీగా పెరిగిపోయిన విష‌యం తెలిసిందే.

Update: 2021-05-10 08:59 GMT

ఏపీ బోర్డర్ వద్ద కొనసాగుతున్న తనికీలు 

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా విజృంభ‌ణ భారీగా పెరిగిపోయిన విష‌యం తెలిసిందే. తెలంగాణలోకి వెళ్తున్న కోవిడ్ పేషేంట్స్ అనుమతిపై కఠిన నిబంధనలు టీఎస్ పోలీసులు అమలు చేస్తున్నారు. క‌రోనాకు చికిత్స కోసం ఏపీ నుంచి తెలంగాణకు వ‌చ్చే రోగుల‌ను పోలీసులు అనుమ‌తించ‌ట్లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నుంచి క‌రోనా రోగుల‌తో వస్తున్న అంబులెన్స్‌లను అడ్డుకుని, వాటిని వెనక్కి పంపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే క‌రోనా రోగులను తెలంగాణ‌లోకి అనుమతించ‌ట్లేద‌ని పోలీసులు తెలిపారు.

హైదరాబాద్‌లో క‌రోనా చికిత్స‌ల కోసం ఆసుప‌త్రుల్లో పడకలు, ఆక్సిజన్ సౌక‌ర్యాలు లేవ‌ని పోలీసులు అంటున్నారు. కాగా, ఈ విష‌యం తెలుసుకున్న కర్నూలు పోలీసులు పుల్లూరు టోల్‌గేట్‌ వద్దకు చేరుకుని తెలంగాణ పోలీసులతో మాట్లాడారు. తమ ఆసుప‌త్రులలో ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని, చేర్చుకుంటామ‌ని ఆయా ఆసుపత్రులు హామీ ఇస్తే కనుక అంబులెన్స్‌లను తెలంగాణలోకి విడిచిపెడుతున్నారు.

తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుతో పాటు కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద తెలంగాణ పోలీసులు ఈ రోజు ఉద‌యం నుంచి తనిఖీలు చేస్తున్నారు. .ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి వ‌చ్చే ఇత‌ర‌ వాహనాలను మాత్రం పోలీసులు అనుమ‌తిస్తున్నారు.

Tags:    

Similar News