స్వర్ణ ప్యాలెస్‌ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత

Update: 2020-08-25 07:03 GMT

Andhra Pradesh ministers has distributed exgratia for swarna palace victims family : స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. బాధిత కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం చెక్కులను రాష్ట్ర మంత్రులు ఆళ్ల నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, కొడాలి నాని, జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌, సామినేని ఉదయభాను తదితరులు అందించారు.

ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మట్లాడుతూ.. రమేష్ ఆస్పత్రి బాధ్యతారాహిత్యం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయాలతో బయటపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవత్వంతో స్పందించి ఎక్స్‌గ్రేషియా మంజూరు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రులు అనుమతుల్లేకుండా, భద్రతా ప్రమాణాలు పాటించకుండా కొవిడ్‌కేర్‌ సెంటర్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags:    

Similar News