AP Weather Update: ద్రోణి ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

AP Weather Update: ఏపీలో ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురువనున్నాయి. ఎండలు మండే ఈ కాలంలో ఈ సంవత్సరం విచిత్రమైన వాతావరణం చోటు చేసుకుంది.

Update: 2025-05-09 09:57 GMT

Weather Update: 4 రోజుల పాటు రాష్ట్రంలో వానలే వానలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ..!!

AP Weather Update: ఏపీలో ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురువనున్నాయి. ఎండలు మండే ఈ కాలంలో ఈ సంవత్సరం విచిత్రమైన వాతావరణం చోటు చేసుకుంది. కొన్ని ప్రాంతాలలో తీవ్రంగా ఎండలు మరికొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ద్రోణి ప్రభావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రస్తుతం ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు, రేపు, ఎల్లుండి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తాలో ఈరోజు, రేపు, ఎల్లుండి బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎమ్‌డీ అంచనా వేసింది.

Tags:    

Similar News