పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు : ఏపీ హైకోర్టు

Update: 2019-11-08 08:09 GMT

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీలకు పదవీకాలం ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించక పోవడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ యు దుర్గా ప్రసాద రావు విచారణ చేపట్టారు.స్ ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడంపై ప్రభుత్వాన్ని వివరణ కోరింది కోర్టు. ఎన్నికలు ఎందుకు జరగలేదని, చట్టాలు ఏమి చెబుతున్నాయో తెలుపుతూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేయడంలో విఫలమైతే, వారు కోర్టుకు హాజరు కావాలని హెచ్చరించింది. అనంతరం విచారణను నవంబర్ 14 కి వాయిదా వేసింది. 

Tags:    

Similar News