చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత తగ్గింపు

Update: 2019-06-25 05:18 GMT

చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత తగ్గించారు. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చే సరికి భద్రత ఉపసంహరించారు. జెడ్ క్యాటగిరి ఉన్న లోకేష్‌కి భద్రత తగ్గించి 2+2 గన్‌మెన్లను మాత్రమే ఇచ్చారు. మిగిలిన కుటుంబ సభ్యులకు పూర్తిగా భద్రత తొలగించారు. అయితే కనీసం సమాచారం ఇవ్వకుండా భద్రత తగ్గించడాన్ని టీడీపీ నాయకులు తప్పుబడుతున్నారు. వైఎస్ జగన్‌కి ప్రతిపక్ష నేతగాను, పాదయాత్రలో కూడా కావాల్సినంత భద్రత కల్పించామని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు కుటుంబంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కుటుంబసభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు మంగళవారం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఎంపీల పార్టీ మార్పు, ప్రజా వేదిక కూల్చివేత తదితర విషయాలపై చంద్రబాబు నేడు స్పందించే అవకాశం ఉంది. 

Tags:    

Similar News