10 వ తరగతి పరీక్షల పై ప్రభుత్వం కీలక నిర్ణయం

Update: 2019-08-18 10:39 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణలో పలు మార్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబొతోంది. ప్రస్తుతం ఉన్న పది మార్కుల బిట్ పేపర్ స్ధానంలో ఏకవాక్య సమాధానాలు రాసే విధంగా ప్రశ్నలు ఇచ్చెలా కసరత్తు చేస్తోంది. బిట్‌ పేపర్‌ వల్ల మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోందని, కార్పొరేట్‌ విద్యా సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ప్రతి సబ్జెక్టు రెండు పేపర్లు కలిపి 35 మార్కులు వస్తే పాస్ అయినట్లు పరిగణంచే వారు. అయితే ఇక నుంచి రెండు పేపర్ల లో ప్రతి దానిలో ను 17.5 మార్కులు వస్తేనే ఉత్తీర్ణత అయినట్లు పరిగణిస్తారు.

Tags:    

Similar News