ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఔదార్యం!

Update: 2020-04-08 05:00 GMT

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వాల చేస్తున్న ఈ పోరాటానికి సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు బాసటగా నిలుస్తున్నారు. పీఎం సహాయనిధితో పాటు రాష్ట్ర సీఎంల సహాయనిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏంపీల జీతాలు, ఎంపీలాండ్స్ నిధుల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. ఇంకా దాతలు ముందుకు రావాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

తన జీతంలో 30 శాతం ఏడాది పాటు కోత విధించాలని కోరారు. తన అంగీకారాన్ని లేఖలో ప్రస్తావించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలతో రాజ్ భవన్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి లేఖ రాస్తూ తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసే క్రమంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఈ క్రమంలో అర్ధిక పరమైన వెసులుబాటు తప్పనిసరని సూచించారు.

Tags:    

Similar News