తెల్లరేషన్ కార్డుదారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

కరోనా మహమ్మారి వేగంగా వ్యాపించడంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Update: 2020-03-29 14:03 GMT
YSJagan

కరోనా మహమ్మారి వేగంగా వ్యాపించడంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఉపాధి లేక ఇళ్లకే పరిమితం అయిన పేదలను ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.ఇక నుంచి పేదలకు నెల రోజుల్లో మూడుసార్లు రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఒక్కో కుటుంబానికి 15 కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పును అందించనున్నారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో జరిగిన హైలెవల్ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో మార్చి 29న మొదటివిడుత, ఏప్రిల్ 15న రెండో విడుత, మళ్లీ మూడో విడుత ఏప్రిల్ 29న రేషన్ పంపిణీ చేయనున్నారు. అలాగే, ఏప్రిల్ 1వ తేదీన పింఛన్లను పంపిణీ , ఏప్రిల్ 4వ తేదీన కరోనా సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కుటుంబానికి రూ.1000 చొప్పున రేషన్ కార్డు దారులకు అందించనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 19 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 4, కృష్ణాజిల్లాలో 4, విశాఖలో 4, ప్రకాశం జిల్లాలో 3, నెల్లూరు కర్నూలు తిరుపతి రాజమండ్రిలో ఒక్కొక్కటిగా కరుణ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వైద్యులు తగిన సూచనలు చేస్తున్నారు. 

Tags:    

Similar News