ఏపీ అసెంబ్లీ కమిటీలు నియామకం

Update: 2019-11-08 03:04 GMT

రాష్ట్ర శాసనసభ కమిటీలను స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. వివిధ కమిటీలకు చైర్మన్‌లను, సభ్యులను నియమించారు. శాసనసభ ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌గా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుని నియమించారు. దీంతో పాటు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని శాసనసభ హక్కుల కమిటీ చైర్మన్‌గా నియమించారు. పిటీషన్ కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితో పాటు ఆరుగురు సభ్యులను, సభ హక్కుల కమిటీ చైర్మన్‌గా కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా కొట్టు సత్యనారాయణను నియమించారు. రూల్స్‌ కమిటీలో మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి స్థానం దక్కింది. శాసనసభ పిటిషన్స్‌ కమిటీ సభ్యుడిగా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని సభ్యులుగా నియమించారు. అలాగే ప్రివిలేజ్‌ కమిటీలో సభ్యుడిగా మాజీ ఎంపీ, గూడూరు ఎమ్మెల్యే డాక్టర్‌ వెలగపల్లి వరప్రసాద్‌ను నియమించారు. 

Tags:    

Similar News