నిమ్మగడ్డ వ్యవహారంలో కౌంటర్ ఫైల్ చేయని ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవిని కుదించడంతో పదవి కోల్పోయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించారు.

Update: 2020-04-17 01:50 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవిని కుదించడంతో పదవి కోల్పోయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించారు.దీనిపై తక్షణం స్టే ఇవ్వాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ ఆఫిడవిట్ పై ఈ నెల 16వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. అయితే కౌంటర్‌ దాఖలు చేసేందుకు మరో రెండు రోజులు సమయం కావాలని రాష్ట్రప్రభుత్వం హైకోర్టును కోరింది. ఈ మేరకు అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం గురువారం విజ్ఞప్తి చేశారు.

కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా మాజీ జస్టిస్ కనగరాజ్ ను ఏపీ ప్రభుత్వం నియమించింది. అయితే తన పదవీకాలం తగ్గించి ఇంకొకరిని నియమించడంపై రమేష్ కుమార్ ఆయన తోపాటు పలువురు టీడీపీ నేతలు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్యలతో కూడిన ధర్మాసనం.. 16వ తేదీ లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.


Tags:    

Similar News