ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ సంబంధించిన కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

Update: 2020-04-07 07:20 GMT
YSR Aarogyasri Scheme (File Photo)

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ సంబంధించిన కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 15 రకాల ప్రొసీజర్స్‌ను ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో చేర్చారు. కరోనా పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, ఇతర వ్యాధులతో కలిపి వైద్యానికి ధరల ప్యాకేజీ నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనీస మొత్తంగా రూ. 16 వేల నుంచి గరిష్ఠంగా రూ. 2.16 లక్షల వరకు చికిత్స ఫీజలను నిర్ణయించింది.

ఇక ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో అయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కు పెరిగింది. ఈ కేసుల్లో కూడా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు. కేసుల్లో కర్నూలు జిల్లా టాప్‌లో ఉంది. ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారు.


Tags:    

Similar News