ఏపీ నిరుద్యోగులకు శుభవార్త : ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత గడువు పెంపు

ఏపీలో ఉన్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత వయస్సును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Update: 2020-06-18 02:29 GMT
YS Jagan (File Photo)

ఏపీలో ఉన్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత వయస్సును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న వేలాది మంది నిరుద్యోగులు మరలా ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులుగా పరిగణింపబడతారు. ఈ అవకాశాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

గ‌వ‌ర్న‌మెంట్ నియామకాల్లో 42 ఏళ్ల అర్హతా వయసు గడువును ఏపీ స‌ర్కార్ పొడిగించింది. వాస్త‌వానికి 2019 సెప్టెంబర్ 30తో ముగిసిన గడువును 2021 సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు విడుద‌ల‌ చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​, ఇతర గ‌వ‌ర్న‌మెంట్ ఏజెన్సీల నియామకాల్లో ఈ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది.

అధిక వయోపరిమితిని 42 కి పెంచడం ద్వారా ప్రత్యక్ష నియామకాల ద్వారా ఎక్కువ మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించే అవకాశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంపొందించింది. అయితే, యూనిఫాం సర్వీసుల (పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ శాఖలు) పోస్టులకు ప్రత్యక్ష నియామకానికి ఇది వర్తించదు.


Tags:    

Similar News