ప్రచారాన్ని నమ్మొద్దు.. సరిహద్దుల్లో రాకపోకలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ
లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోగా, బార్డర్ లో బందోబస్తు ఏర్పాటైన సంగతి తెలిసిందే.
లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోగా, బార్డర్ లో బందోబస్తు ఏర్పాటైన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల వద్ద మూడు నెలల క్రితం ఏర్పాటు చేసిన చెక్ పోస్టును సోమవారంతో తొలగించనున్నారని వస్తున్న ప్రచారంలో నిజం లేదని ఏపీ ప్రభుత్వం స్పస్టం చేసింది. తొలి దశలో కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే అధికారులు అనుమతించారు. ఆపై దశలవారీగా ప్రభుత్వం ఆంక్షలను సడలిస్తూ.. ఉండటంతో వాహనాల రాకపోకలు పెరిగాయి.
ఆంధ్రప్రదేశ్ వచ్చే సరిహద్దుల వద్ద చెక్ పోస్టులను తొలగిస్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని ప్రభుత్వం కోరింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా సరిహద్దుల్లో చెక్ పాయింట్లను యథాతథంగా నిర్వహిస్తామని ప్రభుత్వ నోడల్ అధికారి కృష్ణబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీలోకి రావాలనుకునేవారు స్పందన వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసేకోవాలని స్పష్టం చేశారు. అలా రాష్ట్రంలోకి వచ్చినవారు ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉండాలని తెలిపారు.