ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఉదయం 11 గంటల వరకే అనుమతి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ మరింత పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించింది.

Update: 2020-03-29 12:12 GMT
YSJagan

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ మరింత పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించింది.అర్బన్‌ ప్రాంతాల్లో ప్రస్తుతం పాటిస్తున్న సమయం కుదించింది. పట్టణాలు, నగరాల్లో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకే నిత్యావసరాలకోసం అనుమతి ఇవ్వనుంది. మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంటవరకూ అనుమతి ఇవ్వనుంది. అమ‌రావ‌తిలో సీఎం నిర్వ‌హించిన స‌మీక్ష స‌మావేశంలో మంత్రులు ఆళ్ల నాని, బొత్స స‌త్య‌నారాయ‌ణ, బుగ్గ‌న‌, సుచ‌రిత , క‌న్న‌బాబు తో పాలు డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ తో పాటు ప‌లువురు అధికారులు పాల్గొన్నారు.

నిత్యావసర ధరలు అధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. నిత్యావసరాలకు ఏ కొరత లేకుండా చూడాలని. నిత్యావసర వస్తువుల విక్రయాలపై కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సీఎం జగన్‌ ఆదేశించారు. ఇక ఆదే సమయంలో దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా చూడాలి సీఎం సూచించారు. సామాజిక దూరం పాటించేలా మూడుకు మించి లైన్లు ఉండేలా చెప్పరు. అలాగే మొబైల్‌ వ్యాన్ల ద్వారా ఆర్టీసీ బస్సులద్వారా నిత్యావసరాల పంపిణీపై సమావేశంలో ప్రస్తావించారు. ఆక్వారైతుల సమస్యల పరిష్కారానికి త‌గు సూచ‌న‌లు చేశారు. నిర్ణయించిన ధరకన్నా రైతుల తక్కువ ధ‌ర‌కు కొనుగోలు చేస్తేచర్యలు తీసుకోవాల‌ని సూచించారు.

అలాగే వ్యవసాయానికి అవసరమైన ఎరువులు రవాణా నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారుల వెల్లడి సీఎంకు వివ‌రించారు. విత్తనాల సరఫరా కూడా నిలిచిపోకుండా చూస్తున్నమని అధికారులు తెలిపారు. సామాజిక దూరం పాటిస్తూ వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది దీనిపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నామని అధికారుల వెల్లడించారు.

ప్రతి జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ ఉందన్న డీజీపీ తెలిపారు. ఎక్కడ సమస్యలున్నా వెంటనే పరిష్కారానికి కాల్‌సెంట్‌ద్వారా ప్రయత్నిస్తున్నామన్న డీజీపీ స్ప‌ష్టం చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న అర్బ‌న్ ప్రాంతాల‌పై వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టామన్న డీజీపీ ఈ స‌మావేశంలో తెలిపారు. 

Tags:    

Similar News