లాక్ డౌన్ వేళ.. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం..నాయి బ్రాహ్మణులుకు రూ. 10వేలు
కరోనా ప్రభావంతో దేశం మొత్తం ఏప్రిల్ 15 వరకూ లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా కూడా లాక్ డౌన్ అమలవుతున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
కరోనా ప్రభావం తో దేశం మొత్తం ఏప్రిల్ 15 వరకూ లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా కూడా లాక్ డౌన్ అమలవుతున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో పని చేసే నాయి బ్రాహ్మణులుకు రూ. 10వేలు అడ్వాన్స్‌గా ఇస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. దీంతో దేవాలయాల్లో భక్తులకు కేశకండన చేస్తూ.. జీవనం సాగిస్తున్న క్షురకులకు ఉపాధి లేకుండా పోయింది. ఉపాధి లేక వారి కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి.
కాగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎనిమిది ప్రముఖ దేవాలయాల్లో పని చేస్తున్న 517 మంది, 80 చిన్న దేవాలయాల్లోని 451 మంది వెరిసి మొత్తంగా 968 మంది క్షురకులు వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా వీరికి ఉపాధి లేకుండా పోయింది. అందుచేత తమను ఆదుకోవాలని క్షురకుల జేఏసీ ప్రభుత్వాన్ని అభ్యర్ధిచింది.
దీంతో వారి విజ్ఞప్తి మేరకు దేవాలయం క్షురకుడుగా పని చేసే వారికి ప్రభుత్వం నుంచి రూ. 10వేలు చెల్లిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి అన్నారు. ఈ మొత్తాన్ని నెలవారీ సులభ వాయిదాల్లో పరిస్థితులు పరిస్థితులు చక్కబడిన తర్వాత దేవాలయానికి జమ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.