నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

Update: 2019-11-01 02:20 GMT

ప్రస్తుతం నవ్యాంధ్రగా చెపుతున్న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నేడు. నవంబర్ 1వ తేదీ అని ప్రభుత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మూడురోజుల పాటు ఘనంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈరోజు నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.

అలాగే పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి చెందిన స్వర్గీయ పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతు, కడప కోటిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి, దామోదరం సంజీవయ్యల వారసులు, బంధువులను రాష్ట్ర అవరతణ సందర్బంగా ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది.

Tags:    

Similar News