ఆంధ్రప్రదేశ్‌ రుణభారం వివరాలు వెల్లడించిన కేంద్రం

Update: 2019-06-25 11:23 GMT

ఆంధ్రప్రదేశ్‌ రుణభారంపై వివరాలను కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసింది. రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2018-19 సంవత్సరానికి 2 లక్షల 49 వేల 435 కోట్లకు రుణభారం పెరిగిందని వెల్లడించింది. 2015 నుంచి 2017 మధ్యకాలంలో ఏకంగా 35 శాతం రుణభారం పెరిగినట్లు పేర్కొంది. 2015 లో మొత్తం రుణభారం లక్షా 48 వేల 743 కోట్లు కాగా 2017 మార్చ్‌ నాటికి రాష్ట్ర రుణభారం 2 లక్షల ఒక వేయి 314 కోట్లుగా లెక్కగట్టింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి 8 వేల 256 కోట్ల రుణం అదనంగా తీసుకున్నారని తేల్చింది. ఉదయ్‌ పథకం కింద విద్యుత్‌ పంపిణీ సంస్థల బకాయిల చెల్లింపు కోసం అదనపు రుణం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. 

Tags:    

Similar News