AP CM YS Jagan on Private Hospitals: ఎక్కువ బిల్లులు వేస్తే చర్యలు: సీఎం జగన్

AP CM YS Jagan on Private Hospitals: కోవిడ్ చికిత్స కోసం పప్రైవేటు ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎక్కువ బిల్లులు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం జగన్ హెచ్చరించారు.

Update: 2020-08-25 10:02 GMT

YS Jagan (File Photo)

AP CM YS Jagan on Private Hospitals: కోవిడ్ చికిత్స కోసం పప్రైవేటు ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎక్కువ బిల్లులు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం జగన్ హెచ్చరించారు. జీఓలో పేర్కొన్న దానికంటే ఎక్కువ ఛార్జ్ చేస్తే చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రులపై కల్లెక్టర్లు, పోలీసులు దృష్టి పెట్టాలని.. నిబంధనలను పాటిస్తున్నారా? లేదా? అనేది తెలుసుకొనేందుకు మండల స్థాయిలో 3-5 మందితో కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. సోమవారం నాడు 8,601 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 8,741 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో సోమవారం నాడు 86 మంది ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరులో 10 మంది, ప్రకాశంలో 10 మంది, తూర్పు గోదావరిలో తొమ్మిది మంది, గుంటూరులో తొమ్మిది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, కడపలో ఎనిమిది మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, విశాఖపట్టణంలో ఏడుగురు, అనంతపూర్‌లో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, కర్నూలులో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మరణించినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 3,58,817. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3,368. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,65,933కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 89,516 మంది చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 54,463 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటి వరకు ఏపీలో 32,92,501 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం. 


Tags:    

Similar News