ఏక్కడివాళ్ళు అక్కడే ఉండండి : జగన్

కరోనాలాంటి వైరస్‌ వందేళ్లకు ఓ సారి వస్తుందేమో. జీవితంలో ఒక జనరేషన్‌ ఒకసారి చూస్తారేమో.

Update: 2020-03-26 14:05 GMT
YS Jagan Mohan Reddy

కరోనాలాంటి వైరస్‌ వందేళ్లకు ఓ సారి వస్తుందేమో. జీవితంలో ఒక జనరేషన్‌ ఒకసారి చూస్తారేమో. ఇలాంటి వైరస్‌లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని, లేకపోతే ఈ వ్యాధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యం తప్పదని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నప్పుడు ఎవరికైనా బాగులేకపోతే గుర్తించడం సులభం అవుతుంది. తెలంగాణ సరిహద్దు నుంచి ఏపీలోకి వచ్చేందుకు రాష్ట్రానికి చెందిన వారు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల మన వాళ్ళని కూడా రాష్ట్రంలోకి ఆహ్వానించలేదని, వచ్చే మూడు వారాలు ఏపీ ప్రజలు కూడా ఎక్కడికి కడలోద్దు అని జగన్ వెల్లడించారు.. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల కొరత లేదు. ప్రతి 2, 3 కిలోమీటర్ల పరిధిలో రైతు బజార్లను విస్తరిస్తున్నాం. ఉ.6 నుంచి మ.ఒంటిగంట వరకు నిత్యావసరాల కోసం బయటకు రావొచ్చు. పొలం పనులకు వెళ్లేవారు కూడా సామాజిక దూరం పాటించాలనీ జగన్ అన్నారు.


Tags:    

Similar News