టిఎన్ శేషన్ మృతిపట్ల సీఎం జగన్‌ సంతాపం

Update: 2019-11-11 07:00 GMT

మాజీ ముఖ్య ఎన్నికల కమిషనర్ టిఎన్ శేషన్ (86) మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.  తన సంతాప సందేశంలో వైయస్ జగన్.. టిఎన్ శేషన్ నిజాయితీ, నిబద్ధత తన పని పట్ల అంకితభావంతో పనిచేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవకుడిగా టిఎన్ శేషన్ సమాజానికి చేసిన కృషి ఎంతో ఉందని ఆయన అన్నారు.

శక్తివంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించడానికి భారత ఎన్నికల సంఘం యొక్క శక్తిని ఎలా ఉపయోగించవచ్చో ఆయన నిరూపించారని జగన్ తన సందేశంలో పేర్కొన్నాడు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో టిఎన్ శేషన్ పేరు ఎప్పటికీ బంగారు అక్షరాలతో చెక్కబడి ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.

కేబినెట్ కార్యదర్శిగా పనిచేసిన ఐఎఎస్ అధికారి టిఎన్ శేషన్ పదవీ విరమణ తరువాత భారత 10వ ముఖ్య ఎన్నికల కమిషనర్ అయ్యారు, 1990 డిసెంబర్ 12 నుండి 1996 డిసెంబర్ 11 వరకు పనిచేశారు. ముఖ్యంగా 1990 లలో దేశంలో ఎన్నికల సంస్కరణలకు నాయకత్వం వహించారు శేషన్. గుండెపోటుతో ఆదివారం చెన్నైలో మరణించారాయన.

Tags:    

Similar News