Andhra Pradesh:నేడు ఏపీ కేబినేట్ సమావేశం

Andhra Pradesh:మంత్రులందరిచేత రాజీనామా చేయించనున్న సీఎం

Update: 2022-04-07 00:44 GMT

నేడు ఏపీ కేబినేట్ సమావేశం

Andhra Pradesh: 'మంత్రివర్గం' పునర్‌వ్యవస్థీకరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇవాళ జరిగే కేబినెట్‌ సమావేశమే ప్రస్తుత మంత్రులకు ఆఖరి భేటీ కానుంది. రాష్ట్ర మంత్రివర్గంలో ఉండేదెవరో పోయేదెవరో ఇవాళ తేలిపోనుంది. ఈ భేటీలోనే మినిస్టర్ల అందరిచేత సీఎం జగన్‌ రాజీనామా చేయిస్తారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

సీఎం జగన్ ఢిల్లీ నుంచి రాగానే రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో సమావేశమయ్యారు. కేబినెట్‌ ప్రక్షాళనపై ఆయనకు వివరించారు. 11వ తేదీన కొత్త మంత్రులతో ప్రమాణం చేయించాలని కోరారు. దీనికి గవర్నర్‌ అంగీకరించారు. సీఎం జగన్ మంత్రివర్గంపై గవర్నర్ కు సమాచారం ఇవ్వడంతో ఆశావాహుల్లో టెన్షన్ పెరిగింది. ఇదే సమయంలో మంత్రి పదవిపై సమాచారం ఉన్నవాళ్లు, గట్టి నమ్మకంతో ఉన్నవారు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

గత నెలలో జరిగిన కేబినెట్‌ భేటీలో సామాజిక సమీకరణల కారణంగా ఒకరిద్దరు మంత్రులను కొనసాగించక తప్పదని ముఖ్యమంత్రి అన్నారు. ఇది సీనియర్‌ మంత్రుల్లో అసంతృప్తి రాజేసింది. సీనియర్‌ మంత్రులకూ ఉద్వాసన పలుకుతానని జగన్‌ చెప్పడం తీవ్ర అవమానంగా వారు భావించారు.

ఇవాళ జరిగే కేబినేట్‌ చివరి భేటీలో మంత్రివర్గంలో మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతమున్న మంత్రివర్గంలో ఉన్నవారిలో కొందరిని ఎందుకు కొనసాగించాలని అనుకుంటున్నాను అనే విషయాలపై జగన్ క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. కేవలం మంత్రులకు క్లారిటీ ఇవ్వడమే కాదు. అదేరోజు వారితో తమ పదవులకు సీఎం జగన్ రాజీనామా చేయిస్తారనే ప్రచారం ఉంది. ఆ తరువాత రెండు రోజుల పాటు పదవులు కోల్పోయిన మాజీలతో వన్ టు వన్ సీఎం మాట్లాడనున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఎవరు ఏం చేయాలి అన్నదానిపై పూర్తిగా క్లారిటీ ఇవ్వనున్నారు.

మరోవైపు 10న కొత్తగా మంత్రివర్గంలో స్థానంపొందే వారికి సీఎం సమాచారం ఇవ్వనున్నారు. 11న కొత్త మంత్రులతో ప్రమాణాస్వీకారం చేయించనున్నారు. మొత్తానికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ముఖ్యమంత్రి భేటీ కేబినెట్‌ సమావేశంలో మంత్రులందరి మూకుమ్మడి రాజీనామాల్లాంటి అంశాలు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

Tags:    

Similar News