ఏపీ కేబినెట్: బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఆమోదం

Update: 2020-03-27 12:52 GMT
ap cabinet

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో కేబినేట్ కీలకమైన పలు నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)కు సంబంధించి మూడు నెలలకు ఓట్ ఆన్ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఏపీ గవర్నర్ కూడా ఆమోదం తెలపనున్నారు.

ఇక ఇదే సమావేశంలో కరోనా వైరస్ కట్టడిపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ఐదుగురు మంత్రులతో కలిసి పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబు సభ్యులుగా ఉన్నారు. అంతేకాకుండా సీనియర్ ఐఎఎస్ అధికారి కృష్ణ బాబు నేతృత్వంలో రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల లభ్యతలో వికేంద్రీకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.  

Tags:    

Similar News