Andhra Pradesh: పచ్చిమ గోదావరి జిల్లా తణుకులో దారుణం
Andhra Pradesh: కరోనా పేషెంట్‌ను అడ్మిట్ చేసుకోని ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది * రాత్రంతా ఆస్పత్రి దగ్గరే పడిగాపులు
Representational Image
Andhra Pradesh: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం వెలుగుచూసింది. తణుకు ఆస్పత్రిలో చేరేందుకు వచ్చిన కరోనా పేషెంట్.. రాత్రంతా రహదారిపైనే గడపాల్సి వచ్చింది. భీమవరం శివారు నాయుడుపేటకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అతడు.. తణుకులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చాడు. అయితే.. బాధితుడి పరిస్థితి సాధారణం కంటే భిన్నంగా ఉండటంతో ఆస్పత్రి సిబ్బంది అతడిని అడ్మిట్ చేసుకునేందుకు నిరాకరించారు. దీంతో.. రోగి ఆస్పత్రి సమీపంలోనే పడిగాపులు కాశాడు. ఇక.. సమాచారం అందుకున్న బాధితుడి బంధువులు.. అక్కడకు చేరుకొని అతడిని కాకినాడ ఆస్పత్రికి తరలించారు.