ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Update: 2020-06-12 02:00 GMT

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఏపీ కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే వైఎస్ఆర్ చేయూతతో పాటు జగనన్న తోడు అనే పేరుతో మరో పథకం ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకే.. మంత్రివర్గం మొగ్గు చూపింది. ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఏడాది మార్చ్‌లో ఓటాన్‌ అకౌంట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఈ దఫా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 16న గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు బీఏసీ సమావేశం జరుగుతుంది.

ఇటు ఆగస్టు 12 న వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో 50 వేల ఆర్థిక సాయం అందించనుంది. అక్టోబర్‌లో ప్రారంభం కానున్న జగనన్న తోడు కార్యక్రమం ద్వారా.. చిరు వ్యాపారులకు సున్నా వడ్డీతో రుణాలు అందజేయనున్నారు. 

Tags:    

Similar News