Andhra Pradesh: ఆక్సిజన్‌ సరఫరాపై ప్రత్యేక దృష్టి.. భారీగా నిధులు కేటాయింపు

Andhra Pradesh: రాష్ట్రంలో 49 చోట్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు

Update: 2021-05-09 10:20 GMT

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతుంది. అయితే ఈ మ‌హమ్మ‌రి కార‌ణంగా అక్సీజ‌న్ అంద‌క‌ ఎంద‌రో అమ‌యాకులు ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నేప‌థంలో జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా వైద్యానికి ఆక్సిజన్‌ సరఫరా కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లకు భారీగా నిధులు కేటాయించింది. ఈ మేర‌కు వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆక్సిజన్ త‌యారి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్ర‌భుత్వం .309.87 కోట్ల రూపాయ‌లు కేటాయించింది.

రాష్ట్రంలో 49 చోట్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటుగా, 50 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్‌ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇక మ‌రో ప‌ది వేల అదనపు ఆక్సిజన్‌ పైప్‌లైన్ల కూడా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయనుంది. ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు వచ్చే ఆరు నెలలకు 60 లక్ష రూపాయ‌లు ప్రభుత్వం మంజూరు చేసింది.

ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణ ఇంఛార్జ్‌గా స్పెషల్ సీఎస్ కరికాల వలవన్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరాపై కరికాల వలవన్‌ దృష్టిసారించనున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ దిగుమతిని ఆయన పర్యవేక్షిస్తారు

Tags:    

Similar News