Supreme Court: పరీక్షలపై సుప్రీంలో ఏపీ అఫిడవిట్
Supreme Court: అఫిడవిట్ దాఖలు చేసిన విద్యాశాఖ కార్యదర్శి * జులై చివరి వారంలో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడి
సుప్రీమ్ కోర్ట్ (ఫైల్ ఇమేజ్)
Supreme Court: టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జులై చివరి వారంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇంటర్నల్ పరీక్షలపై ఇంటర్మీడియట్ బోర్డుకు అజమాయిషీ లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా సరైన రీతిలో ఖచ్చితమైన విద్యార్థుల ఉత్తీర్ణతలను నిర్ణయించలేమన్నారు.
ఒక్కో గదిలో 15 నుంచి 18 మంది విద్యార్థులు మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం చెబుతుతోంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు, ఉపాద్యాయులకు మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్కానర్స్ ఏర్పాటు చేస్తామని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది.