పరీక్షలు లేకుండా పదో తరగతి స్టూడెంట్స్ ని ఇంటర్ కు ప్రమోట్ చేయాలి..

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ధాటికి అన్ని రంగాలు కుదేలైపోయాయి.

Update: 2020-03-28 02:55 GMT

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ధాటికి అన్ని రంగాలు కుదేలైపోయాయి.ఇప్పటికే క రోనా దెబ్బకు నీట్ పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు పరీక్షలు లేకుండానే 9వ తరగతి వరకు నేరుగా ప్రమోట్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా ఈ నేపథ్యంలో ఈసారి పదో తరగతి పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులకు ఇంటర్‌లో ప్రవేశాలు కల్పించాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

ఇంటర్‌లో చేరే సమయంలో అవసరమైతే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించేలా ప్రభుత్వం నిబంధన తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. పదో తరగతి హాజరు ప్రాతిపదికగాను, కింది తరగతుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా చేసుకుని విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని ప్రకటనలో కోరారు. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి కోరారు.

 

Tags:    

Similar News