రాజమండ్రి కోర్టులో అనంతబాబు బెయిల్ పిటిషన్
MLC Anantha Babu: బెయిల్ ఇవ్వొద్దని మృతుడి కుటుంబసభ్యుల పిటిషన్
రాజమండ్రి కోర్టులో అనంతబాబు బెయిల్ పిటిషన్
MLC Anantha Babu: మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్‌పై రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. దళిత యువకుడు సుబ్రహ్మణ‌్యం హత్య కేసులో అనంతబాబు మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
బెయిల్ కోసం అనంతబాబు తరఫున న్యాయాది రాజమండ్రి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు బెయిల్ మంజూరు చేయవద్దని మృతుడి కుటుంబసభ్యులు పిటిషన్ వేశారు. దీనిపై కూడా ఇవాళ విచారణ జరుగనుంది.