స్థానికులలో భయం రేకెత్తిస్తున్న కియా పరిశ్రమ

Update: 2020-05-15 10:41 GMT

ఎక్కడైనా లాక్ డౌన్ తర్వాత పనులు మొదలైతే ఎవరైనా సంతోషిస్తారు కానీ అనంతపురం పెనుకొండలో కియా ప్లాంట్ కార్ల ఉత్పత్తి ప్రారంభం స్థానికుల్లో భయాన్ని నింపుతోంది. కారణమేంటి? ఈస్టోరీ చూడండి.

అనంతపురం పెనుకొండలో కియాకార్ల పరిశ్రమ తిరిగి ప్రారంభం కావడం స్థానికుల్లో భయాన్ని నింపుతోంది. మార్చి నెలలో లాక్ డౌన్ తో మూతపడిన పరిశ్రమ తిరిగి మే నెల 7 వతేదిన తెరుచుకుంది ఈ కార్ల పరిశ్రమ తో పాటు దీని అనుబంధ సంస్థలలో దాదాపు 20 పరిశ్రమలు తిరిగి మొదలయ్యాయి. లాక్ డౌన్ సడలింపుతో 30 శాతం ఉద్యోగులతో కియా పరిశ్రమ, దాని అనుబంధ సంస్థలలో పనులు ప్రారంభించారు. ఈ పరిశ్రమలలో దాదాపు 15 వేల వరకు కార్మికులు పని చేస్తున్నారు. ఇందులో కొరియన్లు, తమిళనాడు, కర్ణాటక, ఏపీకి చెందిన ఉద్యోగులు వివిధ విభాగాల్లో పనులు చేస్తుంటారు.

అయితే కియా కార్ల పరిశ్రమలో తమిళనాడుకు చెందిన వారే ఎక్కువ గత రెండు రోజులుగా కియా సంస్థ లపై hmtv వరుస కథనాలను ప్రసారం చేయడం తో ఉన్నతాధికారులు తమిళనాడు ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటికే 17 మంది తమిళనాడుకు చెందిన వ్యక్తులను క్వారంటైన్ చేశామన్నారు. బయటి వ్యక్తులు ఎవరొచ్చినా కోవిడ్ 19 పరీక్షలు, క్వారంటైన్ తప్పనిసరి అని నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని పెనుకొండ సిఐ శ్రీహరి అన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఏదేమైనా ప్రజలలో భయాందోళనలు మాత్రం తగ్గటం లేదు.

Tags:    

Similar News