అనకాపల్లిలో దారుణం..విద్యార్ధినిపై స్క్రూ డ్రైవర్‌తో దాడి చేసిన ప్రేమోన్మాది

Update: 2019-08-28 12:42 GMT

విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో దారుణం జరిగింది. డిగ్రీ చదువుతున్న విద్యార్ధినిపై ఓ ప్రేమోన్మాది దాడి చేశాడు. స్క్రూ డ్రైవర్‌తో విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో అమ్మాయి పరిస్థితి విషమంగా మారింది. అనకాపల్లి రామచంద్ర థియేటర్‌ వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలు డీవీఎన్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో దారి కాసిన ఉన్మాది దాడికి పాల్పడ్డాడు. 

Tags:    

Similar News