Andhra Pradesh: అనంతపురం జిల్లా దర్గా హోన్నూరులో ఉద్రిక్తత
* బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
Andhra Pradesh: అనంతపురం జిల్లా దర్గా హోన్నూరులో ఉద్రిక్తత
Andhra Pradesh: అనంతపురం జిల్లా దర్గా హోన్నూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన జనసేన పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి, ఎంపీ రంగయ్య, బోయ గిరిజమ్మలను జనసేన నేతలు, అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
దీనికి సంబంధించిన చెక్కులు ఇచ్చేందుకు వెళ్లగా జనసైనికులు అడ్డుకున్నారు. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నేతలతో జనసైనికులు వాదనకు దిగడంతో పోలీసులు జనసేన నేతలు కార్యకర్తలు అక్కడి నుంచి పక్కకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, జనసేన కర్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వం అన్ని విధాలుగా బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.