Chittoor: 8నెలల గర్భిణిపై ఆమె భర్త కుటుంబసభ్యులు మూకుమ్మడి దాడి

Chittoor: గర్భిణీకి గాయాలు..హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

Update: 2022-12-20 02:16 GMT

Chittoor: 8నెలల గర్భిణిపై ఆమె భర్త కుటుంబసభ్యులు మూకుమ్మడి దాడి 

Chittoor: చిత్తూరు జిల్లా యాదగిరి మండలంలోని 70 కొత్తపల్లి గ్రామంలో దారుణం జరిగింది. కుటుంబ తగాదాల కారణంగా 8నెలల గర్భిణీ అని కూడా చూడకుండా ఆమె భర్త కుటుంబసభ్యులు విచక్షణా రహితంగా దాడి చేశారు. తన తల్లిదండ్రులతో గొడవపడి..న్యూ ప్రశాంత్‌నగర్‌లో ఉంటున్న భానుచందర్‌పై అతని పెదనాన్న కుటుంబం కక్ష్యలు పెంచుకుంది. మొత్తం ఆరుగురు కుటుంబసభ్యులు కలిసి..భానుచందర్‌పై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమెకు గాయాలు కావడంతో హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భానుచందర్‌..తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.

Tags:    

Similar News