Ambati Rambabu: తెలుసుకో బ్రో.. పొత్తు ధర్మమే కాదు.. ఏ ధర్మము పాటించని వాడే బాబు
Ambati Rambabu: తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ ఎక్స్‌లో అంబటి ట్వీట్
Ambati Rambabu: తెలుసుకో బ్రో.. పొత్తు ధర్మమే కాదు.. ఏ ధర్మము పాటించని వాడే బాబు
Ambati Rambabu: టీడీపీతో సీట్ల పంపకాలపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై.. మంత్రి అంబటి స్పందించారు. పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మము పాటించని వాడే బాబు అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ రాసుకొచ్చారు.
టీడీపీ అభ్యర్థుల ప్రకటనపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మండపేటలో అభ్యర్థిని ప్రకటించడాన్ని పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. టీడీపీకి కౌంటర్‌గా అభ్యర్థులను ప్రకటించారు పవన్. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని పవన్ స్పష్టం చేశారు. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు ప్రకటించకూడదని పవన్ అన్నారు. దీంతో టీడీపీ- జనసేన పొత్తులపై అంబటి విమర్శలు గుప్పించారు. పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మము పాటించని వాడే బాబు అంటూ ఎద్దేవా చేశారు. తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ ఎక్స్‌లో అంబటి ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది.