Ambati Rambabu: బక్రీద్ ప్రార్ధనలో పాల్గొన్న మంత్రి అంబటి
Ambati Rambabu: త్యాగనిరతికి ప్రతీక బక్రీద్
Ambati Rambabu: బక్రీద్ ప్రార్ధనలో పాల్గొన్న మంత్రి అంబటి
Ambati Rambabu: త్యాగనిరతితోపాటు మనోవాంఛ, స్వార్థం, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగలో ఆంతర్యమన్నారు మంత్రి అంబటి రాంబాబు. బక్రీద్ పర్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని పిడుగురాళ్ల మార్గంలో ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, ఏడాదంతా కుటుంబాల్లో నూతన శోభ సంతరించాలని మంత్రి ఆకాంక్షించారు.