వైసీపీ, టీడీపీ పోటాపోటీ రౌండ్ టేబుల్ సమావేశాలు

ఏపీలో రాజధాని వార్ రగులుతూనే ఉంది. అమరావతి వేదికగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పోటాపోటీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నాయి.

Update: 2019-12-05 05:25 GMT

ఏపీలో రాజధాని వార్ రగులుతూనే ఉంది. అమరావతి వేదికగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పోటాపోటీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. టీడీపీ సమావేశానికి అఖిలపక్షం నేతలను ఆహ్వానించింది. వైసీపీ మినహా 17 రాజకీయ పార్టీలకు టీడీపీ ఆహ్వానం పంపింది. రాజధాని నిర్మాణం, ఉపాధి కల్పన, సంపద సృష్టి, అలాగే చేపట్టాల్సిన పనులపై ప్రధానంగా టీడీపీ సమావేశంలో చర్చించనున్నారు. అయితే బీజేపీ నుంచి సమావేశానికి వచ్చేందుకు ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది.

టీడీపీ సమావేశానికి వస్తున్నట్టు సమాచారం ఇవ్వలేదు బీజేపీ. ఇక వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆధ్వర్యంలో తుళ్లూరు వేదికగా రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ప్రజాసంఘాలు, అమరావతి ప్రాంత రైతులు, కూలీలను ఆహ్వానించింది వైసీపీ. ఇందులో చంద్రబాబు కుంభకోణమే అసలు కుంభకోణం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరుపుతోంది. వైసీపీ, టీడీపీ పోటాపోటీ సమావేశాలతో వాతారణం హీటెక్కింది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. 

Tags:    

Similar News