ఉపరాష్ట్రపతిని కలిసిన అమరావతి రైతులు

Update: 2020-02-04 07:40 GMT

తమ ఉద్యమాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు అమరావతి రైతులు..అక్కడ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కలిసి తమ అవేదని వెల్లడించాడు. రాజధాని నిర్మాణం కోసం మేము వేలాది ఎకరాల భూములు ఇచ్చామని, ఇప్పుడేమో రాజధాని మార్పు అంటున్నారని శాంతియుతంగా మేం ఆందోళన వ్యక్తం చేస్తే తమపై పోలీసులు అన్యాయం దాడులు చేశారని వెంకయ్యకి ఫిర్యాదు చేశారు. అమరావతి నుంచి రాజధాని తరలించకుండా, రాజధాని కోసం భూములు ఇచ్చిన తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాష్ట్రపతి, ఇతర బీజేపీ పెద్దలు, సోనియా గాంధీ , రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ లు కూడా కోరామని, వారిని కూడా కలిసి సమస్య వివరిస్తామని తెలిపారు.

హైకోర్టులో పిటిషన్ దాఖలు

ఇక ఇటీవల అనేక ప్రభుత్వ కార్యాలయాలను కర్నూలుకు తరలించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలుకు కార్యాలయాల తరలింపుకు సంబంధించి జిఓ సమస్యను సవాలు చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రైతుల పిటిషన్ GO నెంబర్ 13 చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. రైతుల తరఫున న్యాయవాది కర్మంచి మణి ఇంద్రానిల్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు (మంగళవారం) విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News