సీఎం జగన్‌ను కలిసిన రాజధాని రైతులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చెందిన రైతులు సీఎం జగన్‌ను కలిశారు.

Update: 2020-02-04 15:12 GMT
జగన్‌ను కలిసిన రాజధాని రైతులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చెందిన రైతులు సీఎం జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుమారు 50 మంది రైతులను జగన్ దగ్గరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జగన్‌కు రాజధాని రైతులు తమ సమస్యలను వివరించారు. రైతు కూలీలకు పెన్షన్ రూ. 2500 నుంచి 5 వేలు పెంచినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. సీఎంతో సమావేశం రైతులు మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్‌ తమకు అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అమరావతి రైతులను సంప్రదించకుండా ఎలాంటి చర్యలు తీసుకోమని సీఎం చెప్పినట్లు వివరించారు. టీడీపీ పాలనలో తమ వద్ద నుంచి భూములు బలవంతంగా తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీ నివేదికను పట్టించుకోలేదని, ఇష్టానుసారంగా తమ భూములను లాండ్ పూలింగ్‌ పేరుతో లాక్కున్నారని వాపోయారు. తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని, సీఎం భరోసా ఇచ్చారని తెలిపారు. భూసేకరణ నోటిఫికేషన్‌, సీఆర్‌డీఏ యాక్ట్, రిజర్వ్‌ జోన్‌ తీసివేయాలని కోరామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వ్‌ జోన్‌ ఎత్తివేస్తామని సీఎం కోరామని అందుకు సీఎం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. మచ్చే మూడు నెలల్లో మంగళగిరి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రైతులకు గత ఐదేళ్ల కాలంలో తీవ్ర నష్టం జరిగిందని అన్నారు.

  

Tags:    

Similar News