East Godavari: కొనసాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర
East Godavari: రైతులకు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు
East Godavari: కొనసాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర
East Godavari: అమరావతి నుంచి అరసవల్లికి రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 34వ రోజుకు ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఎస్.ముప్పవరం నుంచి రైతులు పాదయాత్ర చేపట్టారు. సుమారు 15 కిలోమీటర్ల మేర ఇవాళ పాదయాత్ర కొనసాగనుంది. మరోవైపు రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. అటు వైసీపీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. నల్లబెలూన్లలో వైసీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు.