Amaravati Bandh: నేడు అమరావతి బంద్..

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2020-02-22 05:33 GMT
అమరాతి రైతులు ఫైల్ ఫోటొ

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రైతులు 66 రోజులుగా వారి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అమరాతి రైతులు సడన్ గా బంద్‌‌కు పిలుపునిచ్చారు. రాజధానిలోని 29 గ్రామాల పరిధిలో బంద్ పాటించాలని నిర్ణయించారు. విద్య, వ్యాపార సంస్థలు బంద్‌‌కు సహకరించాలని అమరావతి పరిరక్షణ సమితి కోరింది. మందడం రైతు సుధాకర్​పై పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూనామని..నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చినట్లు జేఏసీ నేతలు వెల్లడించారు.

కృష్ణాయపాలెం, మందడంల్లో రైతులు, మహిళలపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు డ్రోన్ కెమెరాలతో అమరావతిలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నవారి ఇళ్లపై నిఘా ఉంచడంపై పెద్ద దుమారానికి దారి తీస్తోంది. అయితే గ్రామస్థులు మాత్రం మహిళలు స్నానం చేస్తుంటే, డ్రోన్ కెమెరాలతో పోలీసులు చిత్రీకరించారని రైతులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఆరోపణలను పోలీసులు ఖండించారు. పోలీసులు డ్రోన్ కెమెరాలతో వీడియోలు చిత్రీకరిచారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

 

Tags:    

Similar News