అమరావతిలో కొనసాగుతోన్న ఆందోళనలు.. మద్దతుగా టీడీపీ..

అమరావతి రైతుల ఆందోళలు 19 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి.

Update: 2020-01-05 05:04 GMT

అమరావతి రైతుల ఆందోళలు 19 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని నిర్మాణం కోసమని తామంతా తమ భూములు ఇచ్చామని.. ఇప్పుడు వేరే చోటకు తరలించడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అమరావతి వాసులు. ఆదివారం తెల్లవారుజామునుంచే రోడ్లమీదకు వచ్చి నిరసనలు, మహా ధర్నాలు, దీక్షలతో హోరెత్తిస్తున్నారు. తూళ్లూరులో మహిళలు వంటా వార్పుతో నిరసన తెలుపుతున్నారు.. మందడం, ఉద్దండరాయునిపాలెం రైతులు నిరసనలు, ర్యాలీలతో రోడ్లపైకి వచ్చి సేవ్‌ అమరావతి అంటూ నినదిస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

అమరావతి పరిరక్షణ సమితి కూడా రాజధాని ప్రాంతంలో ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా అక్కడ అన్ని ప్రాంతాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాజకీయాలను పక్కనబెట్టి అన్ని పార్టీల నేతలు ఉద్యమానికి సహకరించాలని వారు కోరారు. మరోవైపు అమరావతిలోని పూర్తిస్థాయి రాజధానిని కొనసాగించాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటే.. అటు రాయలసీమకు చెందిన టీడీపీ నేతలు తిక్కారెడ్డి, అమర్నాధ్ రెడ్డి లు తమను పక్క రాష్ట్రాల్లో కలపాలని లేదంటే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే విచిత్రంగా ఉత్తరాంధ్రలో టీడీపీ నేతలు విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని ఏర్పాటును స్వాగతిస్తున్నారు. 

Tags:    

Similar News