అల్లూరి సీతారామరాజు జిల్లా బస్సు ప్రమాదం: సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న ప్రయాణికుల ప్రైవేటు బస్సు లోయలో పడిన ఘటనలో 10 మంది మృతిచెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Update: 2025-12-12 05:36 GMT

అల్లూరి సీతారామరాజు జిల్లా బస్సు ప్రమాదం: సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న ప్రయాణికుల ప్రైవేటు బస్సు లోయలో పడిన ఘటనలో 10 మంది మృతిచెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఘటన సమాచారాన్ని పోలీసులకు అందించారు.

ప్రమాదాన్ని తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చింతూరు, రంపచోడవరం ఏరియా ఆస్పత్రులకి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఘటనలో ఉన్న బస్సు ‘విగ్నేశ్వర ట్రావెల్స్’ కు చెందినది. బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న ప్రయాణికుల బస్సు లోయలో పడిందని, ఈ ప్రమాదంలో అనేక మంది మృతిచెందారని తెలిపారు. అలాగే, గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందేలా అన్ని వర్గాల అధికారులతో చర్చించినట్లు తెలిపారు.

సీఎం చంద్రబాబు అత్యంత బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు మరియు ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని, అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలని ఆదేశించారు.



Tags:    

Similar News