Kasani Gnaneshwar: చంద్రబాబు నిర్ణయం ప్రకారమే పొత్తులు ఉంటాయి
Kasani Gnaneshwar: ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంతో ప్రజలోకి వెళ్ళాము
Kasani Gnaneshwar: చంద్రబాబు నిర్ణయం ప్రకారమే పొత్తులు ఉంటాయి
Kasani Gnaneshwar: తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని మీడియాతో చిట్ చాట్‌లో భాగంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ బలపడుతుందని అన్నారు. ప్రచారంలో బాలకృష్ణతో పాటు అగ్రనాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయం ప్రకారమే పొత్తులు ఉంటాయని... అభ్యర్థులు నియోజకవర్గాల్లో పని చేసుకుంటున్నారని అన్నారు. ఎల్లుండి చంద్రబాబుని కలిసిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వివరించారు.