Andhra Pradesh: నాగులుప్పలపాడు ఎస్‌ఐపై ఆరోపణలు
Andhra Pradesh: తమ కార్యకర్తపై చేయిచేసుకున్నారంటూ..ఒంగోలు రిమ్స్ ఎదుట టీడీపీ నేతల ఆందోళన
Representational Image
Andhra Pradesh: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు ఎస్‌ఐ శశికుమార్ తమ కార్యకర్తపై చేయిచేసుకున్నారంటూ టీడీపీ నేతలు ఒంగోలు రిమ్స్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒంగోలులో 33వ డివిజన్‌లో కార్పొరేటర్‌గా టీడీపీ తరపున పోటీ చేస్తున్న మురళిపై పాత కేసు ఉందంటూ తీసుకెళ్ళి ఎస్‌ఐ చితకబాదారని ఆరోపించారు. 2017లో మురళిపై నమోదైన ఓ కేసులో ఉద్దేశ్యపూర్వకంగా రాజకీయ దురుద్దేశ్యంతో నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళి అసభ్య పదజాలంతో దూషిస్తూ కొట్టారని ఆరోపిస్తున్నారు. రాజకీయ ప్రలోభాలతో తమ కార్యకర్తపై దాడి చేసిన ఎస్‌ఐని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నారు.