ఆశా వర్కర్ల గ్రేడింగ్‌పై మంత్రి ఆళ్ల నాని క్లారిటీ

ఆశా వర్కర్ల అనుమానాలపై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని క్లారిటీ ఇచ్చారు. ఆశా వర్కర్లకు గ్రేడింగ్, పాయింట్ల వ్యవస్థ లేదన్న ఆళ్ల నాని ఎలాంటి కండీషన్స్ లేకుండా పదివేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు.

Update: 2019-08-27 12:03 GMT

ఆశా వర్కర్ల అనుమానాలపై ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని క్లారిటీ ఇచ్చారు. ఆశా వర్కర్లకు గ్రేడింగ్, పాయింట్ల వ్యవస్థ లేదన్న ఆళ్ల నాని ఎలాంటి కండీషన్స్ లేకుండా పదివేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. పెంచిన జీతాలను ఆగస్ట్ నుంచి వర్తింపజేసి సెప్టెంబర్ నుంచి చెల్లించనున్నట్లు తెలిపారు. ఆశా వర్కర్లు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దన్న మంత్రి బకాయిలను కూడా త్వరలోనే చెల్లిస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం తమదన్న ఆళ్ల నాని ఆశా వర్కర్లు విపక్షాల వలలో పడొద్దని సూచించారు.

Tags:    

Similar News