విశాఖ ఏజెన్సీలో రెండు రోజులు బంద్.. జీవో 3 రద్దును వ్యతిరేకిస్తూ డిమాండ్

సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో 3 రద్దును వ్యతిరేకిస్తూ బుధ, గురువారాల్లో విశాఖ ఏజెన్సీ మొత్తం బంద్ జరుగుతోంది.

Update: 2020-06-17 03:53 GMT

సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో 3 రద్దును వ్యతిరేకిస్తూ బుధ, గురువారాల్లో విశాఖ ఏజెన్సీ మొత్తం బంద్ జరుగుతోంది. జీవో 3 సాధన కమిటీ పిలుపు మేరకు మన్యంలోని 11 మండలాల్లో ఈ బంద్ కొనసాగేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే దీనికి మద్దతు మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ , మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో పాటు తెలుగు దేశం నాయకులు, అన్ని ప్రజా సంఘాలు మద్దతు పలుకుతున్నారు. వీరితో పాటు మావోయిస్టు పార్టీ సైతం మద్దతు పలుకుతూ లేఖ రాసింది. దీనిపై ఆదివాసీ సంఘాలన్నీ ఏకమై నెల రోజుల పైగా దీనిపై ఆందోళన చేస్తున్నాయి.

జీవో 3ని వ్యతిరేకిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ ఫిటిషన్లు వేయాలని ఇప్పటికే పలు మార్లు కోరారు. అధికార పార్టీ ఎమ్మేల్యేలు సైతం సోమవారం సీఎం జగన్మోహనరెడ్డిని కలిసి పరిస్థితి వివరించారు. ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు. అయితే దీనిపై తెలంగాణా ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసేందుకు ముందుకు రాగా, మిగిలిన వారు నోరు మెదపడం లేదు. ఈ నేపథ్యంలో ఆదివాసీ సంఘం పేరుతో రెండు రోజుల పాటు బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపధ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఈ రో జు

పాడేరు ఆర్టీసీ కాంప్లెక్ వద్ద ఆందోళన ఆదివాసీ సంఘం సభ్యులు ఆందోళన చేశారు. బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా 100% ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలని, జీవో3 పై కేంద్రరాష్ర్ట ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేయాలని, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆర్డినెన్స్ జారీ చేయాలి , గిరిజన సలహా మండలి చర్చించి 100% రిజర్వేషన్ చట్ట బద్ధత కల్పించాలి, ఐటిడిఎ లో ఉద్యోగాలు స్థానిక ఆదివాసీలతోనే భర్తీ చేయాలని వారంతా డిమాండ్ చేశారు. అరకులో సైతం బందు ప్రశాంతంగా సాగుతోంది.

* జీవో నెంబర్ 3 ని రద్దుని వ్యతిరేకిస్తూ ఏజెన్సీ వ్యాప్తంగా గిరిజన సంఘాలు చేపట్టిన బంద్ కు అందరూ మద్దతు పలుకుతున్నారు.

* ఎటువంటి వాహనాలను రోడ్డు పైకి అనుమతించడం లేదు.

* ఆర్టీసీ బస్సులను ముందస్తు చర్యల్లో భాగంగా నిలిపివేశారు.

* దుకాణాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేశారు.

* పర్యాటక ప్రదేశాలకు కూడా మూసివేయబడ్డాయి.

* ఈ బంద్ కు ఏజెన్సీలో గల సుమారు 40 గిరిజన సంఘాలు తమ మద్దతు ను ప్రకటించాయి. ఈ బంద్ కు రాజకీయ పార్టీలతో పాటు మావోయిస్టులు కూడా సమర్థించడం కొసమెరుపు 

Tags:    

Similar News